Jd Vance Couple Telugu Connection,Usha Chilukuri: తెలుగు మూలాలు మర్చిపోని అమెరికా సెకండ్ లేడీ.. ఉషా యూ ఆర్ గ్రేట్..! – jd vance and usha chilukuri india tour celebrating telugu heritage in the us vice presidents family

Date:

- Advertisement -


Usha Chilukuri Vance Andhra Connection: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో సహా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన భార్య ఉష చిలుకూరి తెలుగు అమ్మాయి కావడంతో ఈ పర్యటన తెలుగు ప్రజలకు ప్రత్యేక ఆనందాన్నిస్తోంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని భావిస్తున్న నేపథ్యంలో.. జేడీ వాన్స్ జీవితంలో తీసుకొచ్చిన మార్పు.. హిందూ ధర్మం వైపు ఆయనను ఆకర్షించిన ఆమె అలవాట్ల గురించి తెలిస్తే.. మీరూ “ఉషా యూ ఆర్ గ్రేట్..” అనక మానరు.

Samayam Teluguజేడీ వాన్స్ దంపతుల ఇండియా టూర్
జేడీ వాన్స్ దంపతుల ఇండియా టూర్

“ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము..” అంటూ తెలుగు జాతి గౌరవాన్ని రాయప్రోలు సుబ్బారావు ఎలుగెత్తి చాటారు. ఆయన చెప్పిన ప్రతి అక్షరాన్ని నిజం చేస్తూ.. తెలుగు వారి గుండెలు ఉప్పొంగిపోయేలా చేస్తున్న తెలుగుజాతి ముద్దుబిడ్డ ఉషా చిలుకూరి.. అమెరికా సెకండ్ లేడీ హోదాలో తొలిసారి ఇండియా వచ్చారు . ప్రస్తుతం.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఫ్యామిలీ భారత్‌లో పర్యటిస్తున్నారు. అమెరికన్స్‌ దృష్టిలో ఇదొక సాధారణ పర్యటనే కావొచ్చు.. కానీ, చాలా మంది భారతీయులకు.. ముఖ్యంగా తెలుగువారికైతే ఇది చాలా ప్రత్యేకం.

భారత్‌తో పాటు వేరే దేశాల్లో ఉన్న తెలుగు కుటుంబాలకు ఈసారి.. ఇండియాకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ రావటాన్ని సొంత మనిషి వస్తున్నట్టుగానే భావిస్తున్నారు. సాధారణంగా.. దూరపు చుట్టాలకంటే కూడా మన దగ్గర బంధాలకు కాస్త ఎక్కువ విలువ ఇస్తుంటాం. ఎందుకంటే.. జేడీ వాన్స్ అమెరికాకు ఉపాధ్యక్షుడే కావొచ్చు కానీ.. మనకు మాత్రం అల్లుడు..! అవును, మన తెలుగు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మరి. మన సంస్కృతిలో అల్లుడంటే.. ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉంటాయిగా..! అందులోనూ.. అమెరికాలో రెండో పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి మన తెలుగు ఇంటికి అల్లుడైన జేడీ వస్తున్నారంటే.. ఆ మాత్రం సొంతంగా ఫీలవటంలో ఆశ్చర్యమేమీ లేదు.

తెలుగు బంధం.. కుటుంబంతో మొదలు!

జేడీ వాన్స్ పెళ్లి చేసుకున్నది ఉష చిలుకూరి వాన్స్‌ని. ఆమె యేల్‌లా కాలేజీలో చదువుకుంది, మంచి లాయర్ కూడా. అమెరికాలో పెద్ద పెద్ద లాయర్లలో ఆమె ఒకరు. అయితే.. ఉష చిలుకూరి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలోని సాయిపురం. ఆమె తల్లిదండ్రులు 1980లో అమెరికాకు వలస వెళ్లారు. ఆంధ్రా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ శాంతమ్మకు ఉష మనవరాలి వరస అవుతారు. ఉష పుట్టింది పెరిగింది మొత్తం అమెరికాలో అయినప్పటికీ, ప్రస్తుతం అమెరికా సెకండ్ లేడీగా ఉన్నప్పట్టికీ.. ఆమె అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడగలదు. ఆమెకు తెలుగు సంస్కృతి అంటే చాలా ఇష్టం. ఇంట్లోనూ తెలుగు సంప్రదాయాలను పాటిస్తుండటం విశేషం. జేడీ జీవితంలో ఉష.. చాలా మార్పులే తెచ్చింది. అది కేవలం వ్యక్తిగతంగానే కాదు.. ఆధ్యాత్మికంగా కూడా.

దేవుడే లేడన్నవాడు.. దైవం వైపు..!

జేడీ వాన్స్ కాలేజీలో ఉన్నప్పుడు దేవుడు లేడని నమ్మేవాడు. కష్టాల్లో పెరిగాడు కానీ.. ఎలాంటి ఆశలు లేవు. కానీ ఉషను కలిశాక ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఉష ఇంట్లో పూజలు చేస్తుండటం, దేవుడి మీద ఆమె కనబరిచే నమ్మకాన్ని చూసి జేడీ కొత్తగా అనిపించేది. ఆమె చేసే ప్రార్థనలు, మంచిగా ఉండాలని చెప్పే విధానం ఆయన ఆలోచనలను మార్చేశాయి. హిందూత్వంలోని క్రమశిక్షణ, సేవ చేయడం, బ్యాలెన్స్‌గా ఉండటం ఆయనకు బాగా నచ్చాయి. చిన్నప్పటి నుంచి ఏదో వెతుకుతున్న ఆయనకు ఇవన్నీ ఒక దారి చూపించినట్టనిపించాయి.
ఉష చెప్పే మాటలతో జేడీ విశ్వాసం అంటే కేవలం నమ్మకం కాదని.. కష్టాల్లో నిలబడటానికి, ఒక లక్ష్యం కోసం బతకడానికి ఒక దారి అని తెలుసుకున్నాడు. వెంటనే మారకపోయినా.. 2018లో ఆయన మళ్లీ క్రైస్తవుడిగా మారాడు. కానీ ఆ మార్పు మొదలైంది మాత్రం దివాళికి దీపాలు వెలిగించే, సంస్కృత శ్లోకాలు చదివే ఒక తెలుగు ఇంట్లోనే..! హిందూత్వమే ఆయనకు మళ్లీ దేవుడిని గుర్తు చేసింది.

రెండు లోకాలు ఒక్కటయ్యాయి..!

జేడీ, ఉష 2014లో పెళ్లి చేసుకున్నారు. అది కూడా హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాల్లో. ఇది కేవలం రెండు సంస్కృతులు కలిసి ఉండటమే కాదు, ఒకరి విశ్వాసాన్ని ఒకరు గౌరవించుకోవడానికి నిదర్శనంగా నిలిచింది. వేర్వేరు మతాలు, సంస్కృతులు ఉన్నా.. ప్రేమగా, గౌరవంగా కలిసి ఉండొచ్చని సమాజానికి ఓ అందమైన సందేశాన్ని ఇచ్చారు.
జేడీకి ఈ పెళ్లి కేవలం ఒక కుటుంబం మొదలవ్వడం మాత్రమే కాదు.. తనకు ఒక మంచి దారి కూడా చూపించింది. ఉష ప్రభావంతో ఆయన సేవ చేయాలని, అందరితో కలిసి ఉండాలని, వినయంగా ఉండాలని నేర్చుకున్నాడు. సేవ చేయడం, స్వార్థం లేకుండా పని చేయడం వంటి హిందూ ఆలోచనలు ఆయన రాజకీయాల్లో కూడా కనిపిస్తాయి. అందుకే ఆయన పేద ప్రజల గురించి, కష్టపడేవాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు.

సొంత మనుషుల్లా కలిసే సందర్భం..!

వాన్స్ తన భార్య, పిల్లలతో ఇండియాకు వచ్చారు. ఇది మామూలు సమావేశాలు, ఒప్పందాలు, ఫోటోలకు మాత్రమే పరిమితం కాదు. దీని వెనుక చాలా ప్రేమ, ఆప్యాయత ఉంది. ఢిల్లీ, జైపూర్, ఆగ్రాలో వాళ్లు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. భారతీయ సంప్రదాయాల్లో పాల్గొంటూ.. ఇక్కడి కుటుంబాలను కలుస్తూ.. సొంత మనుషుల్లా కలిసిపోనున్నారు.

అందరికీ ఒక గుర్తు!

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాథలిక్ కావచ్చు, పేద కుటుంబంలో పెరిగి ఉండవచ్చు.. కానీ పెళ్లి ద్వారా మన భారతీయ సంస్కృతితో లోతుగా కనెక్ట్ అయి ఉండవచ్చు. ఇది మన దేశంలో అందరూ కలిసి ఉండగలరనే గొప్ప విషయాన్ని చూపిస్తుంది. మనం వేర్వేరుగా ఉన్నా ఒకరినొకరు గౌరవించుకోగలగాలన్న సందేశాన్నిస్తోంది. ఈ ప్రయాణంలో ఉష పాత్ర చాలా ముఖ్యం. ఆమె జేడీ విశ్వాసాన్ని మార్చడమే కాకుండా, తన తెలుగు సంస్కృతిని అమెరికా రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. వైట్ హౌస్‌లో ఆమె ఉండటం మన హిందూ విలువలకు దక్కిన గౌరవంగా భావించొచ్చు. ఆమె రెండు ప్రపంచాల గురించి బాగా తెలుసుకుంది. అందుకే ఆమె కేవలం సెకండ్ లేడీ మాత్రమే కాదు.. ఇరు దేశాలకు ఒక వారధి లాంటిది..!

అల్లుడు మళ్లీ వస్తున్నాడు!

రాబోయే రోజుల్లో మీడియా అంతా వాన్స్ ఫ్యామిలీ టూర్ గురించి ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంది. దేవాలయాలు, వాళ్ల డ్రెస్సింగ్, తెలుగులో మాట్లాడటం, వాళ్ల పిల్లల అల్లరి అన్నీంటినీ మీడియా చూపిస్తుంది. అలా గుర్తుపెట్టుకోడానికి, చూపించడం వెనుక బలమైన విషయమే ఉంది. ఇది కేవలం దేశాల మధ్య సంబంధం మాత్రమే కాదు.. మనందరి మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతకు తార్కాణం. ఎందుకంటే జేడీ వాన్స్ మన భారత నేలపై అడుగు పెట్టినప్పుడు.. ఆయనకు కేవలం అమెరికా ఉపాధ్యక్షుడిగా మాత్రమే కాదు.. ఒక తెలుగు అల్లుడిగా కూడా స్వాగతం లభిస్తుంది. భేదాలతో విడిపోయిన ఈ ప్రపంచంలో.. ఇలాంటి చిన్నపాటి ప్రేమ బంధమే అతి పెద్ద దౌత్య సందేశం అయ్యే అవకాశమూ ఉంది.

మన సంస్కృతి గుండె చప్పుడు!

వాన్స్ ఇంట్లో తెలుగు కేవలం ఒక భాష కాదు.. తరతరాలను కలిపే ఒక బంధం. ఉషకు తెలుగు స్పష్టంగా వచ్చు. ఆమె తన ఆంధ్ర సంస్కృతిని తన ముగ్గురు పిల్లలకు నేర్పిస్తుంటారు కూడా. తాతయ్య అమ్మమ్మకు, బంధువులకు వీడియో కాల్ చేసినప్పుడు “నమస్కారం” చెప్పమని ఉష ప్రేమగా చెబుతారు. పడుకునే ముందు తెలుగు కథలు చదివి వినిపిస్తుంటారు. జేడీ వాన్స్‌కు అంత బాగా రాకపోయినా, కొన్ని చిన్న చిన్న మాటలు నేర్చుకున్నారు. కుటుంబ సభ్యులు కలిసినప్పుడు “బాగున్నారా?” అని అడిగి వాళ్లను ఆశ్చర్యపరుస్తుంటారు.

ఓహియోలో ఆంధ్ర రుచులు!

వాళ్ల వంటగదిలో అచ్చమైన తెలుగు సంస్కృతే ప్రతిబింబిస్తుంటుది. ఉష తన అమ్మమ్మ వంటలు తింటూ పెరిగారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇంట్లో తెలుగు వంటకాలు చేస్తుంటారు. వారంలో ఒకరోజు పప్పు, ఆవకాయ, అన్నం కచ్చితంగా వాళ్ల మెనూలో ఉండాల్సిందే. వారాంతాల్లో అయితే గోంగూర మటన్, కొబ్బరి చట్నీతో దోసెలు, అప్పుడప్పుడు బిర్యానీ కూడా ఉంటుంది. జేడీకి మొదట్లో మసాలా అంటే ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు బాగా అలవాటు పడినట్టు చెప్తుంటారు. తనది “మిడ్‌వెస్టర్న్ నాలుక కానీ ఇప్పుడు ఆంధ్ర రుచి వచ్చేసింది” అని సరదాగా అంటుంటారు జేడీ. వాళ్ల పిల్లలకు పెసరట్టు, మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టమని.. పండుగలప్పుడు బొబ్బట్లు చేయడంలో కూడా సహాయం చేస్తారని చెప్తుంటారు.

ఇంట్లో ఇద్దరు సంస్కృతులు..!

వాన్స్ ఇంట్లో పిల్లలను రెండు సంస్కృతుల్లో పెంచడం చాలా ఆనందంగా ఉంటుంది. పడుకునే ముందు తెలుగు జోలపాటలు పాడతారు, అమెరికన్ కథలతో పాటు తెనాలి రామకృష్ణ కథలు చెబుతారు. పిల్లలను పెద్దవాళ్లను గౌరవంగా పలకరించమని, చేతులు జోడించి నమస్కారం పెట్టమని నేర్పిస్తారు. సేవ చేయడం, విలువల గురించి వివరిస్తారు. ఉష తరచుగా ఇతర తెలుగు- అమెరికన్ కుటుంబాల పిల్లలతో ఆడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. దానివల్ల తన పిల్లలు ఇంటి బయట కూడా తెలుగు వినడానికి, తెలుగు వాళ్ల ప్రేమను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నది ఆమె భావన.

తెలుగు పండుగల సందడి..!

వాన్స్ కుటుంబ క్యాలెండర్‌లో అమెరికన్, తెలుగు పండుగలు రెండూ ఉంటాయి. దీపావళి, ఉగాదిని థాంక్స్ గివింగ్, క్రిస్మస్‌లాగే బాగా జరుపుకుంటారు. ఉగాదికి వాళ్లంతా కలిసి ఉగాది పచ్చడి చేస్తారు. జేడీ కుర్తా వేసుకుని, చేదు వేప, తీపి బెల్లం తింటుంటే చూసి పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. సంక్రాంతికి ఇల్లంతా ముగ్గులతో నిండిపోతుంది, పిల్లలు పెరట్లో గాలిపటాలు ఎగరేస్తారు.

అందరినీ ఆశ్చర్యపరిచిన ఉష పిల్లలు..

నిన్న (ఏప్రిల్ 21న) ఇండియాకు వచ్చినప్పుడు వాన్స్ పిల్లలు ఎయిర్ పోర్ట్ నుంచి సంప్రదాయ దుస్తుల్లో కనిపించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇవాన్, వివేక్ కుర్తాల్లో, మిరాబెల్ అనార్కలీ సూట్‌లో కనిపించటంతో.. ఉష బంధువులతో పాటు సోషల్ మీడియా అంతా ఆశ్చర్యపోయింది. ఈ చిన్న విషయం.. ఉషకు తెలుగు మూలాల పట్ల ఎంత గౌరవముందనేది చెప్పకనే చెప్తోంది.

Usha Chilukuri: తెలుగు మూలాలు మర్చిపోని అమెరికా సెకండ్ లేడీ.. ఉషా యూ ఆర్ గ్రేట్..!

ఎంతో మందికి ఆదర్శం…!

వాన్స్ ఇల్లు రెండు సంస్కృతులు కలిసి ఉండటానికి ఒక మంచి ఉదాహరణ. వారి ప్రయాణం మరెంతో మందికి ఆదర్శం. అక్కడ తెలుగు సంస్కృతిని కాపాడుకోవడమే కాకుండా, అందరితో పంచుకుంటారు, బాగా జరుపుకుంటారు. భాష, ఆహారం, పండుగలు, మంచి అలవాట్లు వాళ్ల రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్”.. అనే తెలుగు సామెతను ఉష పదే పదే గుర్తుచేసుకుంటుంటారంటే.. ఉషకు మన తెలుగు గాలి అన్నా, భారత నేల అన్నా ఎంతో ప్రేమ, మరెంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు. ఆమె తన కుటుంబంతో కలిసి తల్లిగారింటికి వచ్చిన ఈ సందర్భం.. తెలుగువారి గుండెలు ప్రేమతో ఉప్పొంగుతున్న క్షణాలు..!!

రామ్ ప్రసాద్

రచయిత గురించిరామ్ ప్రసాద్రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 9 =

Share post:

Subscribe

Popular

More like this
Related

Bethesda just announced and released the Oblivion remaster

The rumors and the Steam listings were real:...

LG, Samsung sue government over e-waste recycling policy, cite surging costs

South Korea's LG and Samsung have sued the...

Apple Celebrating Earth Day in These Five Ways

Today is Earth Day, and Apple is celebrating...

Top Selling Gadgets