Gunde Ninda Gudi Gantalu Serial,Gunde Ninda Gudi Gantalu Today మార్చి 07 ఎపిసోడ్: ‘మీరు రోహిణీ భర్త కదా?’ మనోజ్‌ని గుర్తుపట్టి, ఏకిపారేసిన మేడమ్ – meena and prabhavathi dispute in gunde ninda gudi gantalu serial 2025 march 07 episode preview

Date:

- Advertisement -


Gunde Ninda Gudi Gantalu 2025 March 07 Episode: ఇక బాలుని ఉదయాన్నే నిద్రలోపి తల స్నానం చేయించి.. కొత్త షర్ట్ వేయించి.. ఉద్యోగానికి ప్రయత్నించమని ఇంటర్వ్యూలకు వెళ్లమని రోహిణీ ప్రేమను పంచితే.. ఇక ప్రభావతి అయితే హారతిచ్చి.. బొట్ట పెట్టి యుద్ధానికి వెళ్లే సైనికుడిలా పంపించడం హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే మీనా .. ప్రభావతికి ఇచ్చి పడేసింది. (photo courtesy by star maa and JioHotstar)

Samayam Teluguగుండె నిండా గుడి గంటలు సీరియల్ (photo courtesy by star maa and JioHotstar)
గుండె నిండా గుడి గంటలు సీరియల్ (photo courtesy by star maa and JioHotstar)

Gunde Ninda Gudi Gantalu 2025 March 07 Episode: మీనా, బాలు కిందకు వచ్చేసరికి .. ప్రభావతి.. మనోజ్‌కి హారతిచ్చి ఉద్యోగం రావాలని దన్నం పెట్టుకుని మరీ వీరతిలకం దిద్దుతుంటే.. ‘వీడు యుద్ధానికి వెళ్తున్నాడా? ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తున్నాడా?’ అంటూ చురకలేస్తాడు బాలు. రగిలిపోతారు మనోజ్ పెళ్లాం, తల్లీ ఇద్దరూ. ‘నేను గ్యారింటీగా చెబుతున్నాను.. వీడు ఒళ్లు వంచి పని చేయలేడు.. అందుకే నా మాట విని.. నాతో సెడ్‌కి వస్తే మంచి కారు అద్దెకు ఇప్పిస్తాను.. చక్కగా డ్రైవ్ చేసుకోవచ్చు అనేసరికి రోహిణీ ‘నీలా నా భర్త చదువుకోలేదు అనుకున్నావా?’ అంటూ రెచ్చిపోతుంది.

దాంతో మీనా ఊరుకోదు. ‘నీ భర్త చదువుని సాధించింది ఏంటీ.. పార్కుల్లో పడుకోవడమే కదా?’ అంటూ చురకలు వేస్తుంది. ఈ రచ్చ మధ్యలో సత్యం రావడంతో.. ‘చూడండి మావయ్యా.. బాలు.. మనోజ్‌ ఉద్యోగం వెతుక్కునే పనికి వెళ్తుంటే వెటకారం చేస్తున్నాడు’ అని కంప్లైంట్ చేస్తే.. ‘వాడికి ఏ పని లేని మాట నిజమే కదమ్మా ’అంటూ బాలుకే సపోర్ట్‌గా మాట్లాడతాడు. ఇక రోహిణీ.. ‘అబ్బా మనోజ్ లేట్ అవుతుంది.. నువ్వు వెళ్లు.. ఈ రచ్చ ఇక్కడితో ఆగేలా లేదు కానీ’ అనేసి పంపేస్తుంది. మనోడు రోడ్ల వెంట తిరుగుతూ ప్రతి ఆఫీస్‌కి వెళ్లి ఉద్యోగాల వేట మొదలుపెడతాడు.

అయితే కమింగ్ అప్‌లో మీనా.. ప్రభావతిని ‘ఏంటి గొంతు పెంచుతున్నారు’ అన్నది వీడియోమామా చేసిన మాజిక్ మాత్రమే. మీనా అయితే డైలాగ్స్ వేసింది కానీ.. గొంతు తగ్గించు అత్తో అన్న రేంజ్‌లో కాదు. మనోజ్ ఇంటర్వ్యూలకు వెళ్లిపోయిన చాలా సేపటికి మీనా వంట పూర్తి చేసి పూల కొట్టుకుని వెళ్లబోతుంటే.. ప్రభావతి.. రోహిణీని తీసుకుని వచ్చి.. ‘హేయ్ ఇలా రావే’ అని మీనాను పిలిచి వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటుంది. ‘నీ మొగుడు ఉన్నాడా?’ అని అడుగుతుంది ముందు జాగ్రత్తగా. ‘నా మొగుడు ఏంటి అత్తయ్యా.. మీ అబ్బాయే కదా.? నా కొడుకు ఉన్నాడా అని అడుగొచ్చు కదా? ఆయన లేరు. ఇప్పుడు తిని వెళ్లారు’ అంటుంది మీనా. ఇక వెంటనే ప్రభావతి వాయిస్ పెంచేస్తూ.. ‘ఏంట్రీ మరి ఇందాక తెగ రెచ్చిపోయావ్.. వాడికి డైలాగ్స్ రాసి ఇచ్చి మరీ వాడితోనూ మాటలు అనిపించి.. నువ్వు మాటలు అంటున్నావ్?’ అని రెచ్చిపోతూ మాట్లాడుతుంది రోహిణీ ముందు.

‘ఏంటి ఆయన ఉన్నారా లేదా అని అడిగి మరీ గొంతు పెంచుతున్నారు?’ అని మీనా అడుగుతుంది. దాన్ని ఎడిటర్ మామ.. మీనానే ప్రభావతిని ఎదిరిస్తున్నట్లుగా మాట్లాడినట్లు చూపించాడు. మరోవైపు మీనా కోపంగా.. మీకు చెప్పేది ఇదే.. నేను మీరు ఏ గొడవ పడినా మధ్యలోకి రాను.. కానీ నా భర్తను అంటే ఊరుకోను.. అయినా నేను నా భర్త పార్కల్లో నిద్రపోవడం లేదు.. ఎవరికి వాళ్లకే పనులున్నాయి.. అంటుంది. ‘ఏంటే అంటున్నావ్?’అని ప్రభావతి అంటే.. ‘నాకు ఒక విషయాన్ని పదిసార్లు చెప్పే అలవాటు లేదు.. అంత టైమ్ లేదు.. పూల షాప్‌కి వెళ్లాలి… అని మీనా వెళ్లిపోతుంది. వెంటనే ప్రభావతి కూర్చీలో కూర్చుని.. ‘అమ్మా రోహిణీ వాటర్ తేమ్మా’ అంటుంది మీనా దెబ్బకు.
ఇక మన మనోజ్ బాబు ఉద్యోగాల వేటలో ఒక ఆఫీస్‌కి వెళ్తాడు. గతంలో తాను చేయను అని చెప్పి వెళ్లిన ఆఫీసే అది. ‘ఆడవారు హెడ్ ఉంటే నేను చేయను.. నా రేంజ్ ఏంటీ.. నా సత్తా ఏంటీ? నేను ఒక ఆడదాని కింద పని చేయడం ఏంటీ?’ అని ఆ రోజు అనేసి వెళ్లిపోయిన మనోజ్.. ఈ రోజు అదే హెడ్(మేడమ్) దగ్గరకు వచ్చి.. జాబ్ అడుక్కుంటాడు. ఆమెకు టైమ్ వచ్చింది. ‘నువ్వు రోహిణీ భర్తవి కదా.. తను నాకు తెలుసు.. తను చాలా మంచి అమ్మాయి. తనలాంటి భార్య దొరకడం నీ అదృష్టం.. కానీ నీకు ఆడవాళ్ల కింద పని చేయడం ఇష్టం ఉండదట కదా? నీకు అది చిన్న చూపు అట కదా.. మరి ఎలా చేద్దామని ఈ ఉద్యోగం కోసం వచ్చావ్?’ అంటూ ఏకిపారేస్తుంది. మనోజ్ ఆమెను ప్లీజ్ మేడమ్.. నేను చాలా మారాను.. అంతకుముందులా లేను.. అలా మాట్లాడటం తప్పే.. నాకు ఈ జాబ్ చాలా అవసరం.. అంటూ వేడుకుంటున్నా.. ఆమె క్షమించేలా కనిపించడం లేదు.. చూద్దాం ఏం జరుగుతుందో.

కీర్తి

రచయిత గురించికీర్తికీర్తి సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో సినిమా, లైఫ్‌స్టైల్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =

Share post:

Subscribe

Popular

More like this
Related

‘No gaali, no dunaali’; Gajraj Rao, Renuka Shahane’s anti-Mirzapur show delivers clean, family entertainment

A stolen motorcycle– ‘dupahiya’– in the fictional village...

Apple Maps EV Routing for Ford Vehicles Now Supports Tesla Chargers

Ford Mustang Mach-E and Ford F-150 Lightning customers...

How to get ancient wyvern coins in Monster Hunter Wilds

Ancient wyvern coins are an special item in...

7th Pay Commission DA hike announcement of 2 percent likely before Holi

The central government is expected to announce a...

Top Selling Gadgets