Engineering student hits teacher with shoe for taking cell phone

Date:

- Advertisement -


  • టీచర్ తన సెల్ ఫోన్ తీసుకున్నరని రెచ్చిపోయిన విద్యార్థిని..
  • బూతులు తుడుతూ చెప్పుతో టీచర్ పై దాడి..
  • విశాఖ, విజయనగరం మధ్యలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్ కళాశాలలో ఘటన..
Andhra Pradesh: ఏం చదువులు ఇవి..? టీచర్‌‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని..

Andhra Pradesh: ఈ రోజుల్లో కొందరు విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే.. ఏం చదువులు ఇవి? అనే పరిస్థితి వచ్చింది.. ఒకప్పుడు ఉపాధ్యాయులు, లెక్చరర్లు అంటే విద్యార్థులకు అంతో ఇంతో భయం.. గౌరవం ఉండేది.. కానీ, ఇప్పుడు టీచర్లపై కుల్లు జోకులు వేయడం ఓ ఎత్తు అయితే.. మా అబ్బాయినే కొడతారా..? మా అమ్మాయితే బెరిస్తారా? అంటూ పేరంట్స్‌ రచ్చ మరోవైపు తయారైంది.. అయితే, ఓ విద్యార్థిని ఏకంగా టీచర్‌పై చెప్పుతో దాడి చేసిన ఘటన ఏపీలో కలకలం సృష్టిస్తోంది.. అంతేకాదు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..

Read Also: ChauryaPaatam : ఐపీఎల్ టికెట్స్ తో ప్రమోషన్స్ కు తెరలేపిన చౌర్య పాఠం టీమ్

టీచర్ తన సెల్ ఫోన్ తీసుకున్నరని ఓ విద్యార్థిని ఏకంగా చెప్పుతో కొట్టింది. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ విచారకరమైన ఘటన విశాఖ, విజయనగరం మధ్య దాకమ్మరిలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ టీచర్ కంట పడింది. వెంటనే టీచర్ ఆ విద్యార్థిని సెల్ ఫోన్‌ను తీసుకున్నారు. అంతే విద్యార్ధిని కోపం నసాలనికెక్కింది. చదువు చెప్పిన టీచర్ అని మరిచి అక్రోషంతో అంతటి గౌరవ ప్రథమైన టీచని చెడా మడా తిట్టేసింది. అక్కడితో ఆగలేదు.. తన కాళ్లకి వేసిన చెప్పు తీసి.. ఆ చెప్పుతో చెప్ప చెల్లుమనుపించింది విద్యార్థిని. ఇది చూసిన తోటి విద్యార్థులు సైతం విడిపించే ప్రయత్నం చేసినా.. ఆ విద్యార్థిని వెనుక్కి తగ్గలేదు కాదా.. ముష్టి యుద్ధానికి దిగింది.. ఇదంతా చూసిన వారు ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేమి విష సంస్కృతి అని తోటి ఉపాధ్యాయులు ముక్కున వేలేసుకుంటున్నారు.. అయితే, ఈ దృశ్యాలను ఓ విద్యార్థి తన మొబైల్‌లో చిత్రీకరించడంతో.. అది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది..





Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − nine =

Share post:

Subscribe

Popular

More like this
Related

Top Selling Gadgets