Allu Aravind: అందుకే బన్నీ ‘తండేల్‌’ ఈవెంట్‌కు రాలేదు.. అల్లు అరవింద్‌

Date:

- Advertisement -


హైదరాబాద్‌: నాగచైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘తండేల్‌’. చందూ మొండేటి తెరకెక్కించారు. ఫిబ్రవరి 7న విడుదల కానుంది. తండేల్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తొలుత చిత్ర బృందం ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో అర్జున్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇటీవల అర్జున్‌ విదేశాలకు వెళ్లాడని అయితే, తీవ్రమైన గ్యాస్‌ సంబంధిత సమస్య కారణంగా బన్నీ ఈ కార్యక్రమానికి రాలేదని అల్లు అరవింద్‌ తెలిపారు. 

సందీప్‌ వంగా అంతా నిజాయతీ వ్యక్తుల్ని చూడలేదు..

నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘ఇటీవలి కాలంలో సందీప్‌రెడ్డి అంత నిజాయతీ వ్యక్తుల్ని చూడలేదు. ఆయన ఇంటర్వ్యూల్లో ఎంతో నిజాయతీ కనిపిస్తుంది. తండేల్‌  చిత్రం చివరి దశలో నాకు కొత్త భయం ప్రారంభమైంది. అల్లు అరవింద్‌, బన్నీవాసు చిత్ర నిర్మాణంలో ఎంతో సహకారం అందిస్తారు. వారు, వారి టీమ్‌ లేకుంటే నా తదుపరి చిత్రం ఎలా ఉంటుందోనని భయం వేస్తోంది. నా దృష్టిలో గీత ఆర్ట్స్‌ ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. ఈ బ్యానర్‌లో పనిచేసిన ఏ నటుడైనా మంచి ఫలితాన్ని చూస్తారు. గతంలో ‘తండేల్‌’ గురించి బన్నీవాసు 10 నిమిషాల పాటు చెప్పారు. అప్పుడే నాకు ఈ అంశంపై ఎంతో ఆసక్తి ఏర్పడింది. 

ఇక సినిమా విషయానికి వస్తే తండేల్‌ రాజుకు.. నా నిజ జీవితానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. చందూ నన్ను నమ్మారు. ఆ పాత్రలోకి మారడానికి నాకు సమయం ఇచ్చారు. ఎంతో ఓపికగా ఉన్నారు. చందూ కాంబినేషన్‌లో ఇది నా మూడో చిత్రం. నా గురించి నాకంటే ఎక్కువగా తనే ఆలోచిస్తాడు. నా మంచి కోసం కొన్నిసార్లు చాలా స్వార్థంగానూ ఆలోచిస్తాడు. చందూ నాకో మంచి మిత్రుడు. 

సాయి పల్లవి పట్ల ఇంత అభిమానం ఇప్పటివరకు చూడలేదు..   

సాయి పల్లవితో కలిసి చిత్ర నిర్మాణంలో భాగం కావాలని టెక్నీషియన్లతో సహా చాలా మంది చెబుతున్నారు. గతంలో చేద్దామనుకున్నా అవకాశం రాలేదని  చెప్పారు. ఈ మధ్య కాలంలో ఒక ఆర్టిస్టు పట్ల ఇంత ఏకపక్షంగా వ్యవహరించిన ధోరణిని చూడలేదు. భవిష్యత్‌లో కూడా చూడను. దీనికి నిజంగా సాయిపల్లవి అర్హురాలు. 

ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ ఒక నిజమైన రాక్‌స్టార్‌. ఒక లవ్‌ స్టోరీకి ఆడియో ఎంతో ముఖ్యం. బుజ్జితల్లి పాట ఈ చిత్ర స్వరూపాన్నే మార్చేసింది. బుజ్జితల్లి పాట ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరికి బాగా తీసుకెళ్లింది. డీఓపీ శ్యామ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ నాగేంద్రది మంచి కాంబినేషన్‌. ‘విరూపాక్ష’ చిత్రం చూసి వారిద్దరితో కలిసి పనిచేస్తే బాగుంటుందని చందూతో చెప్పాను. వారితో కలిసి ఈ చిత్రంలో పనిచేసినందుకు సంతోషంగా ఉంది.  శ్రీకాకుళం యాస అనేది నాకు సవాళ్లతో కూడిన పాత్ర. ఈ విషయంలో డైరెక్టర్‌ టీమ్‌ నాకు ఎంతో సహాయం చేసింది’’ అని నాగచైతన్య అన్నారు.

ఈ సందర్భంగా శ్రీకాకుళం నుంచి వచ్చి మత్సకారులను నాగచైతన్య వేదిక పైకి పిలిచారు. చందూ నన్ను మత్స్యలేశం తీసుకెళ్లారు. అక్కడ ఉన్న వారిని కలిశాకే వారి జీవితం గురించి, వారు ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలిసిందన్నారు. అప్పుడే నాకు తండేల్‌ రాజు కథపై ఒక క్లారిటీ వచ్చింది. వీళ్లలో భయం అనేది కనిపించలేదు. నా దృష్టిలో వీరు నిజమైన హీరోలు. వీరు లేకుంటే ఈ ‘తండేల్‌’ ఉండేది కాదన్నారు. 

సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘‘నిర్మాత అల్లు అరవింద్‌ తనని కూతురుగా భావిస్తారు. అల్లు అరవింద్‌, బన్నీ వాసు సినిమాను బలంగా నమ్ముతారు. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ఆలోచించరు. నాగ చైతన్య తండేల్‌ చిత్రానికి ముందు, ఇప్పుడు ఎంతో మారారు. తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతో ప్రేమిస్తారు’ అని పేర్కొన్నారు.



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + seventeen =

Share post:

Subscribe

Popular

More like this
Related

Just a moment…

https://ghanasoccernet.com/bookmaker-ratings/tips/djurgarden-vs-pafos-preview-prediction-and-betting-tips-13-03-2025/Source link

Best Steam Deck accessories in 2025

What are...

Top Selling Gadgets