- Advertisement -
Electricity Department : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే..
హైలైట్:
- పవర్ గ్రిడ్ జాబ్ రిక్రూట్‌మెంట్ 2025
- 28 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
- మార్చి 25 దరఖాస్తులకు చివరితేది

ఇతర ముఖ్య సమాచారం :
- ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టులు : 28
- అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టం ఇంజినీరింగ్, పవర్ ఇంజినీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
- వయోపరిమితి: 2025 మార్చి 25వ తేదీ నాటికి 29 ఏళ్లు ఉండాలి.
- జీతం: నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు వేతనం ఉంటుంది.
- దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు.
- దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
- ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 25, 2025
India Post : రాతపరీక్ష లేకుండా IPPB బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ జాబ్స్
India Post Payment Bank Recruitment 2025 : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 51 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.ippbonline.com/ చూడటం ద్వారా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి 2025 మార్చి 21 చివరి తేదీగా నిర్ణయించారు. నోటిఫికేషన్ ప్రకారం.. గ్రాడ్యుయేషన్‌లో పొందిన మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితా ఎంపిక చేస్తారు. ఆపై ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు డైరెక్ట్ లింక్ ఇదే.
- Advertisement -