ఎట్టకేలకు బయటకొస్తున్న బన్నీ Great Andhra

Date:

- Advertisement -


మొన్నటివరకు కోర్టు కేసులు, వివాదాలు, బెయిల్ తోనే సరిపోయింది బన్నీకి. వీటి దెబ్బకి అతడు బయటకు రావడమే మానేశాడు. తన సినిమా విజయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోయాడు.

అలా కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్, ఎట్టకేలకు మరోసారి వేదికపై కనిపించబోతున్నాడు. తండ్రి అల్లు అరవింద్ నిర్మించిన తండేల్ ప్రచారం కోసం బయటకొస్తున్నాడు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత పబ్లిక్ ఫంక్షన్ లో బన్నీ కనిపించడం ఇదే తొలిసారి. తండేల్ రాజు కోసం పుష్పరాజ్ వస్తున్నాడంటూ ఇప్పటికే యూనిట్ ప్రచారం షురూ చేసింది.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత చాలా మార్పులొచ్చాయి. సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడం లేదు. ఇచ్చినా కోర్టులు ఊరుకోవడం లేదు. బెనిఫిట్ షోలు పూర్తిగా రద్దయ్యాయి. దీనికితోడు మైనర్లను సెకెండ్ షోలకు అనుమతించొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు పుష్ప-2 థియేట్రికల్ రన్ ముగిసింది. తాజాగా ఓటీటీలోకి వచ్చింది. రీ-లోడెడ్ వెర్షన్ పేరిట ఏకంగా 3 గంటల 44 నిమిషాల సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు. సినిమా చూసి అలసిపోయామంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. 13 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఒకేసారి చూసిన ఫీలింగ్ కలిగిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =

Share post:

Subscribe

Popular

More like this
Related

New Dark Matter Hypothesis Suggests Ionisation Clue in Milky Way’s Core

Unusual activity at the centre of the Milky...

പ്രിവ്യു: സീസണിലെ അവസാന മത്സരത്തിൽ ബ്ലാസ്റ്റേഴ്‌സ്

ഇരു ടീമുകളും പ്ലേ ഓഫിൽ നിന്നും നേരത്തെ...

Where to find Golden Llamas in Fortnite

Golden Llamas are Fortnite Chapter 6 Season 2’s...

Top Selling Gadgets